Friday 16 December 2016

Amma : ఆమె హృదయం ముందు మనమిద్దామనుకున్న బహుమతులు ఎంత?.....

వెలకట్టలేని తల్లి ప్రేమ

ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది.

తల్లి ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదు. 
తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఒకేరకంగా చూసుకుంటుంది
బిడ్డలు ఎంత పెద్దవారైనా ఆ తల్లికి ఇంకా చిన్న పిల్లల వలె కనిపిస్తారు. 
పక్షి తన రెక్కలతో పిల్లలను కాపాడుతుంది.
గూడు తయారు చేసుకుంటుంది.
రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి 
గూడు తయారు చేసుకుంటుంది.
రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి 
గూడు తయారు చేసుకుంటుంది.
రెక్కలు రాని చిట్టి తల్లి కోసం ఆ తల్లి పడరాని పాట్లు పడుతుంది. 
తల్లి ప్రేమను చవిచూసిన వారికి తెలుసు తల్లి విలువ. 
మన నోట్లో అమృత బిందువులు చిలికింది అమ్మే కదా. 
మనం ఏవేళ వచ్చినా అన్నంపెట్టే తల్లి ఆమె. 
మనం తల్లికి ఏమిచ్చినా రుణం తీరదు. 
''గూడులేని పిల్లలకు తెలియాలి గూటి విలువ'' ‘
'రక్షించే చేతులు లేని అనాధలకు తెలుసు చేతుల వెచ్చదనం'' 
అన్న మాటలు అక్షర సత్యాలు. 
పక్షులు గూటి నుండి ఎగిరిపోయినట్లు 
 పిల్లలు చదువుకొని జీవనయానంలో స్థిరపడి, వారి కుటుంబాలు వారికి ఏర్పడతాయి. 
మగపిల్లవాడు వివాహానికి ముందు తల్లిపై ఆధారపడతాడు.
తన దగ్గర ఉన్నవి అమ్మకు ఇవ్వాలని, తల్లిదండ్రుల కోసం ఏవో చేయాలని తపన పడతాడు. వివాహానంతరం ఆ దృక్పధంలో కొంత మార్పు కనిపిస్తుంది. 
ఈ విధంగా కొడుకు తల్లికి దూరం కావటం జరుగుతుంది.
ఎల్లప్పుడూ బిడ్డల గురించే ఆరాటపడే 
ఎల్లప్పుడూ బిడ్డల గురించే ఆరాటపడే 
ఎల్లప్పుడూ బిడ్డల గురించే ఆరాటపడే గొప్ప హృదయం ఆమెది.
మన గురించి తపనపడే ఆరాటపడే ఆమె హృదయం ముందు 
మనమిద్దామనుకున్న బహుమ తులన్నీ దేనికీ సాటికాదు.....

Amma : ప్రతిరోజూ మనం మదర్స డే జరుపుకోవాలి

"పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మా" అని చంద్రబోసు...


"ఎవరు రాయగలరూ, అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం... ఎవరు పాడగలరూ, అమ్మా అను రాగం కన్న తీయని రాగం అని సిరివెన్నెల రాశారు!  వీళ్లు మనకు తెలిసిన వారు, తెలియకుండా రాశినవారు ఎందరో ఉన్నారు! అమ్మ గురించి రాయాలంటే కవే కానక్కర్లేదు,
అమ్మ గురించి చెప్పాలంటే పెద్ద వక్తే అవనవసరం లేదు! ఎవరు రాసినా, ఎన్ని రాసినా... అమ్మ గొప్పతనం మీద ఎన్ని పాటలు, ఎన్ని గేయాలు ఇంకెన్నో కథలో మనకు తెలుసు! మన ఇతిహాసాలు, చరిత్రలు చదివినా ఒక కుంతి, ఒక సీత, ఒక యశోద, కౌసల్య, జిజాబాయ్ అలా ఎంత మంది అమ్మలు తమ వాత్సల్యం తో, ప్రేమతో, అనురాగంతో, అచంచల ధైర్యం తో మహామహులను మనకి అందజేశారు. అమ్మ కోరుకునేది గీతాలు, గేయాలు, కవితలు, మాటలేనా... కాదు, ఆప్యాయతతో కూడిన అమ్మా అనే పిలుపు! 

అమ్మకు ఇచ్చే గౌరవం, ప్రేమా, ఆదరణ! అమ్మకు ఎన్ని నిర్వచనాలో... ఈ భూమి, నీరు, ప్రకృతి కూడా అమ్మ స్వరూపాలే. కాలాలు మారినా తల్లి ప్రేమ తరగలేదు! 

యుగాలు మారినా తల్లి మమకారం మారలేదు! 

కాని, ఆ  తల్లి గర్భంలో పుట్టిన ఎందరు ఆ అమ్మను గుర్తుపెట్టుకుంటున్నారు?  రెక్కలు వచ్చి ఎగిరిపోయే పక్షులుగా

ధనం మూలం ఇదం జగత్ గా మారిన ఎందరికి 

అమ్మ ఋణం తిర్చాలన్న తలంపు ఉంది?  అమ్మ ఏది కోరదు, ప్రేమ చేసినా, ఛీదరించుకున్నా, నడిరోడ్డున వదిలివేసినా తన బిడ్డ సుఖంగా ఉండాలని ముక్కోటి దేవతలను కోరుతుంది. 

తన బిడ్డ ఎంత ఎత్తు ఎదిగినా లోలోన మురిసిపోతూ మెచ్చుకోదు... అమ్మ- దిష్టి తగులుతుందని! అమ్మ తిట్టినా, కసిరినా, అవి బిడ్డకు దీవెనలే. 

అదే శ్రీరామ రక్ష!    ఈ రోజు మనమందరమూ మదర్స్ డే జరుపుకుంటున్నాము. 

మన మాతృమూర్తికి ఎన్నో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నాము. 

మన గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకున్నా చలించని ప్రేమ అమ్మది. 

మదర్స్ డే అన్నది తల్లికి మనం జరుపుకునే పండుగ రోజు! 

నిజానికి, ప్రతిరోజూ మనం మదర్స డే జరుపుకోవాలి. ఎందుకంటే... ఏమి ఇచ్చి, ఎంత చేసి మనం అమ్మ ఋణం తీర్చుకోగలం?
తల్లిని ప్రేమించేవారికి వందనాలు,
తల్లిని ప్రేమించని వారికీ వందనాలు... ఎందుకంటే అలాంటి బిడ్డలను చూసినా అమ్మకు కోపం రాదుకాబట్టి! ఆ గౌరవం మీకు అమ్మవల్లే వచ్చింది... ఆమె నేర్పిన సంస్కారం వల్లే అబ్బింది! తల్లిని ప్రేమించండి... తల్లిని పూజించండి... తల్లే సర్వం,
తల్లే దైవం! మాతృదేవో భవ! 

Amma : ఇమ్ముగఁ జదువని నోరును


ఇమ్ముగఁ జదువని నోరును

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!


Amma : అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే

అమ్మ వంటిది 
అంత మంచిది 
అమ్మ ఒక్కటే
-- ఆత్రేయ

Amma : అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీతమ్.

"అమ్మ మాట ఎంతో ఆనందం మా అమ్మ మనసు మంచి గంధము.అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లనఅమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు,
అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీతమ్. "

Amma : పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా 
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా 
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది 
ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ 
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ 
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ 
వరమిచ్చే తీపి శాపం అమ్మ 
-- చంద్రబోస్‌

Amma : అమ్మను మించి దైవమున్నదా....

  అమ్మను మించి దైవమున్నదా....

జగమే పలికే శాశ్వత సత్యమిదే

అందరిని కనే శక్తి అమ్మ 

ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు... 

నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే

కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా

కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

కణకణలాడే ఎండకు శిరసు మాడినా 

మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ

చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మప్రతి తల్లికి మమకారం పరమార్థం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----
  -- సి. నారాయణ రెడ్డి

Amma : ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం


ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగాఅమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... 
--సిరివెన్నెల సీతారామశాస్త్రి

Amma : అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ?

అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ


---దాశరథి కృష్ణమాచార్య


Amma : అమ్మ అందమైన అనుబంధం


ప్రేమకు మారుపేరు అమ్మ. అమ్మ అందమైన అనుబంధం. అంతేలేని అనురాగం. మరపురాని మధుర జ్ఞాపకం.

Amma : అసమాన అమృతమూర్తి మాతృమూర్తి....


మరో ఊపిరికి రూపాన్నిచ్చే క్రమంలో  కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ  ప్రాణాన్ని ఫణంగా పెట్టే 

అసమాన అమృతమూర్తి  మాతృమూర్తి.... 

Amma : నీ రూణం తీర్చేందుకైనా నా కడుపున నిన్ను మోయాలని ఉందమ్మా...

కన్న బిడ్డను చూడాలనే ఆరాటంతో
కళ్ళు ముసుకొని పురిటి నొప్పులు పంటి బిగువున దాచి
కంటి దారలతోనే దాహాన్ని తీర్చుకుంది.. తన ప్రతి రూపాన్ని చూసికన్నా.. నా కలలకు ప్రతి రూపం నీవేనని నాతో ఊసులెన్నో ఆడేవు.నీ రక్తాన్ని కమ్మని పాలధారగా చేసి నాకందించి
కంటి పాపలా నను పెంచి పెద్ద చేసిననీ కడుపు తీపిని పంచుకున్న నేను నీ రూణం తీర్చేందుకైనా నా కడుపున నిన్ను మోయాలని ఉందమ్మా...



Amma : నిజంగా ఓ వరమే...

అమ్మ ప్రేమ
అమ్మతో అనుబంధంఅమ్మలోని అనురాగం
అమ్మ పిలుపులోని ఆత్మీయత
నిజంగా ఓ వరమే...




Amma : వర్ణించలేను నిన్ను నా అక్షరాలతో "అమ్మ"

గాయపడితే పలికే పలుకు "అమ్మ"ఎడ్చేటప్పుడు చేసే మారం "అమ్మ"ఆకలేస్తే అరిచే అరుపు "అమ్మ"వర్ణించలేను నిన్ను నా అక్షరాలతో "అమ్మ"


Amma : ప్రతీ జన్మకీ ఇలా బానిసనవ్వనా కమ్మనైన అమ్మప్రేమకి..!

అమ్మా..ఆ నింగే తల వంచదా నువు పంచే అనురాగానికి,
సంద్రం కూడా చిన్నబోదా నీలో దాచుకున్న కన్నీళ్ళకి,
వెన్నెల దాసోహమవదా నీ అందమైన ఆత్మీయతకి,
అమృతం కూడా అనవసరం కదా నీ చేతి గోరుముద్దలకి,
ప్రతీ జన్మకీ ఇలా బానిసనవ్వనా

కమ్మనైన అమ్మప్రేమకి..!



Amma : జీవం ఇచ్చే దైవం అమ్మ

కలకాలం తన ప్రేమ మనకి 
ఎల్లకాలం మన వృద్ది తనకి
తను రచించాలి మన జన్మని
మనం రుచించాలి తన ప్రేమని 
జీవం ఇచ్చే దైవం అమ్మ

ప్రాణం పోసే గుణం అమ్మ
దీపం కూర్చే రూపం అమ్మ

Amma : అమ్మే నా ప్రాణం

అమ్మ నీ నామం ఎంతో మధురం
అమ్మ అని పిలిచిన పలుకే బంగారం
అమ్మ కనిపించే దైవం మనకు దైవ సమానం
పూజించాలి ప్రతిదినం
తలుచుకోవాలి ప్రతిక్షణం
మన జననం అమ్మకు ప్రాణశంకటం  పునఃర్జన్మం కానీ లెక్క చేయదు ప్రాణానైనా త్యాగం చెయ్యడం 
అదే అమ్మ గొప్పతనం
మనం వేసే ప్రతి అడుగు, మనం గడిపే ప్రతిక్షణం
మనం సాదించే ప్రతి విజయం దాని వెనుక ఉన్న రహస్యం అమ్మ మనకు తోడుఉండడం
మన ఆనందమే తన సంతోషంగా మన దుఃఖమే తన బాధగా మన భవిష్యత్తే తన లక్ష్యంగా 
మన పుట్టుక  నుండి తన మరణం దాక మన ఆలనాపాలనా చూసుకునేదే అమ్మ
అమ్మ ప్రేమను కొలవడానికి లేదు ఏ  కొలమానం ఎవరితో పోల్చలేని గొప్ప అద్భుతం
అమ్మ మనకు పంచిన ప్రేమలో ఒక్క శాతం మనం ఆమెకు అందిస్తే అదే అమ్మకి గొప్ప ఆనందం
అమ్మకి కలుగుతుంది దుఃఖం మనం తన ప్రేమను అర్థం చేసుకోని క్షణం ఏడుస్తుంది తన నిర్మల హృదయం
అమ్మ రుణం తీర్చుకోడం ఎవరితరం అటువంటి మన భవిష్యత్ నిర్మాత భవిష్యత్తును చెయ్యదు ప్రశ్నార్థకం
అమ్మ నాన్న కలయికే మనం వాళ్ళని కలిపి చూసుకోవడమే మనకు క్షేమం వాళ్ళను విడదీయడం పెద్ద నేరం
అమ్మను ప్రేమించలేనివాడు ఎవరిని ప్రేమించలేడు అమ్మని ప్రేమించేవారిని అందరు ప్రేమిస్తారు
అమ్మ గొప్పతనం చెప్పడానికి సరిపోదు నా జీవితం 
అమ్మే నా ప్రాణం
అమ్మ లేని లోకం శూన్యం కాపాడుకుందాం అనుక్షణం ,

ప్రతి అమ్మకు ఈ కవిత అంకితం. 


 

Amma : పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం మా అమ్మ....

అమృతం లాంటి ప్రేమను పంచేది అమ్మ..
నాకు మాటలు నేర్పమంటే
తను కూడా నాలానే మాట్లాడుతుంది..
నా రేపటి భవిష్యత్తు కోసం
నిత్యం శ్రమించే శ్రామికురాలు
పదాలు తెలియని పెదవులకు

అమృతవాక్యం మా అమ్మ....
అదీ.. అమ్మ గొప్పతనం. 

Amma : అమ్మ గురించి తెలుసా ?

అమ్మ గురించి తెలుసా ?
                        ఈ సృష్టి లో కనిపించే దైవం ఒక్కటే అదే అమ్మ.
అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఒక గంట సేపు ఆలోచిస్తే చాలు,
అమ్మ గొప్పతనం అర్ధమవుతుంది.
మనకి జన్మ నిచ్చిన అమ్మని కలలో కూడా మర్చిపోవద్దు.
అసలు మనిషి పుట్టడమే ఒక పెద్ద అద్బుతం అలాంటిది
ఒక అమ్మ మనకి వంద ఏళ్ల జీవిత కాలాన్ని ఇస్తుంది.
అమ్మ తో కలిసి ఉండడానికి కూడా సమయం ఉండదా,
కనుక అమ్మని కష్ట పెట్టకుండా ,
అమ్మకి సహాయ పడుతూ,
సంతోషంగా ఉంచడమే నువ్వు చేసే పని. 
ఇక్కనైన మేలుకో అమ్మ గురుంచి ఆలోచించు 
అమ్మని బాధపెట్టకు 
అమ్మని సంతోషపెట్టు 
అమ్మను మించి దైవం లేదు..


Amma : అమ్మ లాలి చాలునే

పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే
నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే
నిన్ను కమ్మంగ లాలించునే
         ------వేటూరి 

Amma : సృష్టికి మూలం 'అమ్మ'...

సృష్టికి మూలం 'అమ్మ'...

మమతానురాగాల రూపం 'అమ్మ'...

త్యాగానికి ప్రతిరూపం 'అమ్మ'...

తీర్చుకోలేనిది 'అమ్మ' రుణం... 

సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఇంకేమీ లేదు. 

అమ్మే లేకపోతే మనం లేము. 

మనల్ని నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి 

మనకు జన్మనిస్తుంది

పుట్టాక మనల్ని కంటికి రెప్పలా కాపాడి

మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది. 

మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే.


Amma : అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే... 
ఎందుకంటే... తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి. 
మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ". 
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా". 
అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?
కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే.. 
ఒక విషయం గురించి మాట్లాడమంటే 
1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని

అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....
అదే "అమ్మ ప్రేమ". "ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా
ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే. 
అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...
అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి... 
ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే 
ఈ "అమ్మ ప్రేమ"


Amma : తల్లంటే పిల్లలకు - కరిగే కొవ్వోత్తంది

అక్షరాలూ రాని తల్లి - అ ఆ లు దిద్దించిందిచదువురాని మా అమ్మ - సంస్కారం నేర్పించింది
చెడుచూడకంది - చెడు మాట్లాడకందిచెడు వినుటకు చెవులకు - పని చెప్పోద్దంది
సత్యాన్నే పలకమంది - సద్గుణాలు నేర్వమందిఅసూయా ద్వేషాలకు - ఆమడలో ఉండమంది
చాడీలు చెప్పకంది - చెప్పుడు మాటినకంది
మనసు మలినమయ్యాక - మనిషికి సుఖముండదంది
అనుమానం పెనుభూతం - పట్టుకుంటే వదలదందిపచ్చ కామెర్ల రోగి - కంటి చూపు పచ్చదంది
కూడని విషయాలలో - పోలికలు కూడదందిఅరచేతి లోని వెళ్ళు - అన్ని ఒకటిగా లేవంది
అమ్మనీకు ముద్దితే - ఆప్యాయత చూపమందిపరుల తల్లి లోన కూడా - తన తల్లి ని చూడమంది
క్రమశిక్షణ లేని బ్రతుకు - కాలసర్పమంటిదంది
కాలం గడిచే కొద్ది - కాటేయక మానదంది
ధనం మీద వ్యామోహం - దరికి చేరనియ్యకందివ్యామోహం వ్యసనమైతే - బ్రతుకంతా నరకమంది
కష్టాలు నష్టాలు - కలిసి నన్ను వేధిస్తేకాలే కొలిమి లోన నన్ను - ఇనుప ముక్క కమ్మంది
కష్టపడ్డ మనిషికెపుడు - నష్టాలు లేవందిఅంతిమ విజయం కోసం - ఆశ తో చూడమంది
తల్లంటే పిల్లలకు - కరిగే కొవ్వోత్తందికరిగే తన గుణం లోన - వెలుగును చూడాలంది
పరులకు ఆదర్శంగా - పది కాలాలుండమందిపరుల హితము కోరడమే – పరమేశునికిష్టమంది





Thursday 15 December 2016

Amma : అమ్మంటే ఆప్యాత అమ్మంటే అనురాగం...

అమ్మంటే ఆప్యాత
అమ్మంటే అనురాగం... 

Amma : అమ్మ కొంగు పట్టుకు తిరిగిన జ్జాపకమెంత మధురం....

జ్ఞాపకమెంత మధురం..

అల్లరిగా ఇల్లంతా కలయ తిరిగి 

అమ్మ చేతికి చిక్కకుండా
 
చిందులేసి 

తిన్న 

పాల బువ్వ ఎంత మధురం..

అమ్మా.. అమ్మా..

 అని మనం పిలుస్తున్నప్పుడు 

ఆ తల్లి చూపులో కనిపించే వెలుగెంత మధురం... 

అమ్మ కొంగు పట్టుకు తిరిగిన 

జ్జాపకమెంత మధురం....