Thursday, 15 December 2016

Amma : అమ్మంటే అర్థం కాని పిచ్చి ప్రేమలు గుర్తుకొస్తాయి.

రాసేందుకు ఎంతో ప్రయత్నించా,
రాయలేనని తెలుసుకొని ఇలా తలవంచా...అనంత అర్థాలు కలిగిన అమ్మ తత్వాన్ని అతి కొద్ది అక్షరాలలో అలంకరించలేక ఆవేదనగా మీ ముందు నిలిచా...ఎందుకో అమ్మంటే అంతులేని భావావేశాలు పొంగుకొస్తాయి,
అర్థం కాని పిచ్చి ప్రేమలు గుర్తుకొస్తాయి.త్యాగానికి రుజువులు కళ్ళముందు నిలుస్తాయి,
తన్మయత్వంతో మదిని పరవశింప చేస్తాయి..కాలమెంత మారినా "అమ్మ మనస్సు" మారలేదు.. ప్రేమకి రూపం మగువ అయితే దానికి పరిపూర్ణత అమ్మే కదా..అన్నీ తానే అయి అర్పితమయ్యేది,
అఖిల జగత్తుకి కారణమయ్యేది,
ఆత్మీయతకి అర్థం తెలిపేది,
అనుబంధాలకి వారధి గా మారేది ఒక్క అమ్మే కదా.... 




No comments:

Post a Comment