అమ్మ నీ నామం ఎంతో మధురం
అమ్మ అని పిలిచిన పలుకే బంగారం
అమ్మ కనిపించే దైవం మనకు దైవ సమానం
అమ్మ కనిపించే దైవం మనకు దైవ సమానం
పూజించాలి ప్రతిదినం
తలుచుకోవాలి ప్రతిక్షణం
మన జననం అమ్మకు ప్రాణశంకటం పునఃర్జన్మం కానీ లెక్క చేయదు ప్రాణానైనా త్యాగం చెయ్యడం

అదే అమ్మ
గొప్పతనం
మనం వేసే ప్రతి అడుగు, మనం గడిపే ప్రతిక్షణం,

మనం సాదించే ప్రతి విజయం దాని వెనుక ఉన్న
రహస్యం అమ్మ మనకు తోడుఉండడం
మన ఆనందమే తన సంతోషంగా మన దుఃఖమే తన బాధగా మన భవిష్యత్తే తన లక్ష్యంగా

మన
పుట్టుక నుండి తన మరణం దాక మన ఆలనాపాలనా చూసుకునేదే
అమ్మ
అమ్మ ప్రేమను కొలవడానికి లేదు ఏ కొలమానం ఎవరితో పోల్చలేని గొప్ప అద్భుతం
అమ్మ మనకు పంచిన ప్రేమలో ఒక్క శాతం మనం ఆమెకు అందిస్తే అదే అమ్మకి గొప్ప ఆనందం
అమ్మకి కలుగుతుంది దుఃఖం మనం తన ప్రేమను అర్థం చేసుకోని క్షణం ఏడుస్తుంది తన నిర్మల హృదయం
అమ్మ రుణం తీర్చుకోడం ఎవరితరం అటువంటి మన భవిష్యత్ నిర్మాత భవిష్యత్తును చెయ్యదు ప్రశ్నార్థకం
అమ్మ నాన్న కలయికే మనం వాళ్ళని కలిపి చూసుకోవడమే మనకు క్షేమం వాళ్ళను విడదీయడం పెద్ద నేరం
అమ్మను ప్రేమించలేనివాడు ఎవరిని ప్రేమించలేడు అమ్మని ప్రేమించేవారిని అందరు ప్రేమిస్తారు
అమ్మ గొప్పతనం చెప్పడానికి సరిపోదు నా జీవితం

అమ్మే నా ప్రాణం,
అమ్మ లేని లోకం శూన్యం
కాపాడుకుందాం అనుక్షణం ,
ప్రతి అమ్మకు ఈ కవిత
అంకితం.
No comments:
Post a Comment