Amma : తల్లంటే పిల్లలకు - కరిగే కొవ్వోత్తంది
అక్షరాలూ రాని తల్లి - అ ఆ లు దిద్దించిందిచదువురాని మా అమ్మ - సంస్కారం
నేర్పించింది
చెడుచూడకంది - చెడు
మాట్లాడకందిచెడు వినుటకు చెవులకు - పని
చెప్పోద్దంది
సత్యాన్నే పలకమంది -
సద్గుణాలు నేర్వమందిఅసూయా ద్వేషాలకు - ఆమడలో
ఉండమంది
చాడీలు చెప్పకంది - చెప్పుడు
మాటినకంది
మనసు మలినమయ్యాక - మనిషికి
సుఖముండదంది
అనుమానం పెనుభూతం -
పట్టుకుంటే వదలదందిపచ్చ కామెర్ల రోగి - కంటి
చూపు పచ్చదంది
కూడని విషయాలలో - పోలికలు
కూడదందిఅరచేతి లోని వెళ్ళు - అన్ని
ఒకటిగా లేవంది
అమ్మనీకు ముద్దితే - ఆప్యాయత
చూపమందిపరుల తల్లి లోన కూడా - తన
తల్లి ని చూడమంది
క్రమశిక్షణ లేని బ్రతుకు -
కాలసర్పమంటిదంది
కాలం గడిచే కొద్ది - కాటేయక
మానదంది
ధనం మీద వ్యామోహం - దరికి
చేరనియ్యకందివ్యామోహం వ్యసనమైతే -
బ్రతుకంతా నరకమంది
కష్టాలు నష్టాలు - కలిసి
నన్ను వేధిస్తేకాలే కొలిమి లోన నన్ను - ఇనుప
ముక్క కమ్మంది
కష్టపడ్డ మనిషికెపుడు -
నష్టాలు లేవందిఅంతిమ విజయం కోసం - ఆశ తో
చూడమంది
తల్లంటే పిల్లలకు - కరిగే
కొవ్వోత్తందికరిగే తన గుణం లోన - వెలుగును
చూడాలంది
పరులకు ఆదర్శంగా - పది
కాలాలుండమందిపరుల హితము కోరడమే –
పరమేశునికిష్టమంది
No comments:
Post a Comment